Wednesday, September 2, 2009

నా కన్నుల్లో నీ రూపమేల



ప్రతి క్షణం నీ ధ్యాసేల
నా కన్నుల్లో నీ రూపమేల
గాలి తాకిడికి నీ స్పర్శేల
నీడ లో సైతం నీ ఛాయేల
ప్రతీ కాంతి లో నీ మేరుపేల
ప్రకృతిలో నీ సౌందర్యమేల
నా అధరాలపై అనుక్షణం నీ పేరేల
నీ కొరకై దిగులేల
నీ పై ఇంత తపనేల
నీ ప్రేమకై తపస్సేల
నువ్వు లేని నా జీవితమేల
నీ పై నాకింత ప్రెమేల
సాక్ష్యం ఆ నింగి ఈ నేల
నీలో మౌనమేల
నీ హృదయం కరుగదేల


తొలిసారి ప్రేమలో పడ్డ ప్రతీ ప్రేమికుడు / ప్రేమికురాలు పడే తీయని వేదన ఇది అని నా అభిప్రాయం. అవునో కాదో మీరే చెప్పండి.......


{ సఫలమైనా విఫలమైనా తొలిప్రేమ జీవిత కాలం వెంటాడుతూనే ఉంటుంది.. మరచిపోయాం అని అనుకున్నా / చెప్పినా అది అసత్యం }

0 comments:

Post a Comment

Followers

  ©Template by Dicas Blogger.